ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో ప్రయాణికుల ముందుకు వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పుడు బస్సు ఎక్కండి.. గిఫ్ట్ పట్టిండి అనే విధంగా కొత్త పథకానికి తీసుకొచ్చింది.. శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2 డిపోల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారికి బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ… ఆమదాలవలస, బందరువానిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తావల్లి, యరగాం, విజయనగరం మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అయితే, బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులు.. వారి టిక్కెట్ల వెనుక పేరు, మొబైల్ నంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిప్ట్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.. ఇక, ప్రతి నెల 3వ తేదీ, 16 తేదీల్లో గిఫ్ట్ బాక్స్‌ల్లో వేసిన టికెట్లను కలిపి డ్రా తీస్తారు.. ఆ వెంటనే విజేతలను ప్రకటిస్తారు..
ఇక, డ్రాలో గులుపొందిన వారికి గిఫ్ట్‌లు అందజేయనుంది ఏపీఎస్‌ఆర్టీసీ.. అయితే, శ్రీకాకుళం మాత్రమే కాదు.. పలు జిల్లాల్లో ఇలాగే బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా.. ఎక్కువమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడమే దిశగా ఇలాంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల రూట్లలో ఈ లక్కీ డ్రాను తీసుకొచ్చారు.. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు
👉 – Please join our whatsapp channel here –