Videos

‘ది విలేజ్‌’ ట్రైలర్‌

‘ది విలేజ్‌’ ట్రైలర్‌

ఇప్పటికే ఎందరో హీరో, హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉంటూనే వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆర్య (Arya) సిద్ధమయ్యారు. ఆయన నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’ (The Village). మిలింద్ రాజు దర్శకత్వం వహించారు. ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 24 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అడవి సమీపంలో ఉండే ఓ భయానక గ్రామంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు? అన్నది ఈ సిరీస్‌ కథాంశమని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్‌ మయన్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది. ఆర్య ప్రస్తుతం తెలుగులో ‘సైంధవ్‌’ (Saindhav)లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది. 2024 జనవరి 13న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం.. ‘ది విలేజ్‌’ ట్రైలర్‌ను మీరూ చూసేయండి..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z