DailyDose

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ స్థాయిలో జరుపబడే ఉత్సవం ఇది. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్‌చే ఈ రోజును ప్రారంభించారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుంచి క్రమం తప్పక జరుపుతున్నారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. దీనిని ఐక్యరాజ్యసమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999లో తొలిసారిగా ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 19న ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఇండియాతో పాటు ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరీబీయన్ దీవులు, ఆఫ్రికాతో సహా 60 దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పురుషుల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించడం, లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించడమే.. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z