Business

లగ్జరీ కార్లపై పెరుగుతున్న మోజు- వాణిజ్య వార్తలు

లగ్జరీ కార్లపై పెరుగుతున్న మోజు- వాణిజ్య వార్తలు

లగ్జరీ కార్లపై పెరుగుతున్న మోజు

గతంతో పోలిస్తే భారతీయులు లగ్జరీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా, ఆడి ఇండియా.. ఫెస్టివల్ సీజన్‌ విక్రయాల్లో రికార్డు నమోదు చేశాయి. ప్రతి ఏడాది పొడవునా మామూలుగా సాగే లగ్జరీ కార్ల విక్రయాల్లో ఈ ఏడాది మెరుగైన రికార్డు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓనం నుంచి దీపావళి వరకూ ఫెస్టివ్ సీజన్‌లో మెరుగ్గా కార్ల విక్రయాలు జరిపామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ చెప్పారు. ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న పలు కొత్త మోడల్ కార్లతోపాటు కస్టమర్ల సెంటిమెంట్ కూడా బలంగా ఉందన్నారు. జీఎల్సీ వంటి ఎస్‌యూవీ కార్ల తయారీలో సప్లయ్ చైన్ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి -సెప్టెంబర్ మధ్య లగ్జరీ కార్ల విక్రయాల్లో 88 శాతం గ్రోత్ రికార్డైందన్నారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 5,530 యూనిట్ల కార్లు విక్రయించినట్లు తెలిపారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్ బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ వంటి మోడల్ కార్లు బెస్ట్ మోడల్ కార్లుగా నిలిచాయని చెప్పారు. గత ఏడేండ్లలో తొలిసారి ఈ ఏడాది అత్యధిక కార్లు విక్రయించామని చెప్పారు. హైదరాబాద్ మొదలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర నగరాల్లో తమ కార్లకు మంచి డిమాండ్ ఉందన్నారు.లగ్జరీ కార్ల విక్రయాలు 2018 రికార్డులను అధిగమిస్తుందని బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఈ ఏడాది 46,000-47,000 యూనిట్ల కార్లు అమ్ముడవుతాయని భావిస్తున్నామని, ఈ ఏడాది హై డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రం పవాహ్ మాట్లాడుతూ పండుగల సీజన్‌లో శక్తిమంతమైన కార్లు, మోటారు సైకిళ్లు మార్కెట్లోకి రిలీజ్ చేశామన్నారు.మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని సైతం ఈ ఏడాది 25 శాతానికి పైగా కార్లు నాన్ మెట్రో నగరాల్లోనే విక్రయించిందని ఆ సంస్థ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. గతేడాది 71 రోజుల పండుగల సీజన్‌లో మొత్తం 8.10 లక్షల కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య రిటైల్ కార్ల విక్రయాలు పది లక్షల మార్క్‌ను దాటేశాయి.

సీబీ350 బైక్​ను భారత మార్కెట్లో లాంచ్​ 

హోండా  సీబీ350 బైక్​ను భారత మార్కెట్లో లాంచ్​ చేసింది. ఇందులోని 348.36 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్​ 5,500 ఆర్పీఎం వద్ద 20.78 బీహెచ్​పీని, 3,000 ఆర్పీఎం వద్ద 29.4 ఎన్​ఎం టార్క్ ఇస్తుంది.    హోండా స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

* వరల్డ్ కప్ చూడట్లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ట్వీట్

వరల్డ్‌ కప్‌ 2023 (World Cup 2023) నేపథ్యంలో యావత్‌ భారతావని ఆదివారం టీవీలకు అతుక్కుపోయింది. కానీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మాత్రం మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. పైగా దేశ సేవలో భాగంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సమర్థించుకున్నారు.‘‘నేను వరల్డ్‌ కప్‌ (World Cup 2023) ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి ప్లాన్‌ చేసుకోవడం లేదు (ఇది దేశానికి నేను చేస్తున్న సేవ). కానీ, ఈ జేర్సీ (‘ఎక్స్‌’లో జెర్సీ ఫొటోను పోస్ట్‌ చేశారు) ధరించి ఓ గదికి పరిమితమవుతాను. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాను’’ అని మహీంద్రా తెలిపారు. నిజానికి మహీంద్రా నిర్ణయం ఓ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. ఆయనెప్పుడైతే మ్యాచ్‌ లైవ్‌ చూస్తారో అప్పుడు భారత జట్టు ఓటమి పాలవుతోందనేది ఆయనకు ఉన్న ఓ విశ్వాసం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనిపై పలుసార్లు ఆయన ఫ్యాన్స్‌ స్పందిస్తూ కీలక మ్యాచ్‌లను మీరు చూడొద్దంటూ సరదాగా సలహా కూడా ఇచ్చారు.మహీంద్రా తాజా ట్వీట్‌పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ఇది కూడా జట్టుకు మద్దతుగా నిలవడంలో భాగమే అని కామెంట్‌ చేశారు. మరో వ్యక్తి బదులిస్తూ.. ‘‘మీరు ఎప్పటికీ మా హీరోనే. చరిత్ర మీ త్యాగాన్ని గుర్తించకపోవచ్చు. కానీ, మీ సేవలకు మేం ప్రాచుర్యం కల్పిస్తాం’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. మరో యూజర్‌ మాత్రం ఇవన్నీ అపోహలనీ.. మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయాలని కోరాడు.

ఆర్థిక వ్యవస్థలో 4 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటిన భారత్

2023లో భారత్ అనేక విజయాలను సాధించింది. చంద్రయాన్ సక్సెస్ నుంచి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా భారత జీడీపీ వృద్ధి రేటు భారీగా పెరిగింది. అవును ఎప్పటి నుంచో కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ఇండియా జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే ఒక అద్భుతం చోటు చేసుకుంది. భారత లక్ష్యానికి మరో అడుగు దగ్గరగా మన జీడీపీ వచ్చి చేరింది. ఆదివారం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల నామినల్ జీడీపీ మార్కును చేరింది. ప్రపంచంలో 333 లక్షల కోట్ల విలువైన ఎకానమీగా గుర్తింపును అందుకుంది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) నామమాత్రంగా 4 ట్రిలియన్ డాలర్లను మొదటిసారిగా దాటింది. భారతదేశం ఇప్పుడు $5 ట్రిలియన్లను సాధించే దిశగా పయనిస్తోంది.

15 వేలకే ఆవిష్కరించనున్న ‘క్లౌడ్ లాప్‌టాప్

ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ జియో (Reliance Jio)’ త్వరలో చౌక ధరలో లాప్‌టాప్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ విషయమై టెక్ దిగ్గజాలు హెచ్‌పీ, ఎసెర్, లెనెవో సంస్థలతో రిలయన్స్ జియో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. అత్యంత చౌక ధర రూ.15 వేలకే ఆవిష్కరించనున్న లాప్‌టాప్ ‘క్లౌడ్ లాప్‌టాప్’ అనే పేరుతో వస్తుందని సమాచారం. అన్ని సర్వీసులు పొందేందుకు వీలు కలిగేలా, లాప్‌టాప్‌ల ఖర్చు తగ్గించేలా జియో క్లౌడ్ లాప్‌టాప్ ఉంటుందని వినికిడి. ఇప్పటికే క్లౌడ్ లాప్ టాప్స్ కోసం క్రోమ్‭బుక్‌ను హెచ్‌పీ పరీక్షిస్తున్నది. అయితే ఈ విషయమై అధికారికంగా వెల్లడించడానికి ఆ కంపెనీ ముందుకు రాలేదు. ప్రస్తుతం మార్కెట్లో లాప్ టాప్ ధర కనీసం రూ.50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే. మెమొరీ, ప్రాసెసింగ్ పవర్, చిప్ సెట్ తదితర హార్డ్ వేర్ టూల్స్ ను బట్టి జియో ‘క్లౌడ్ లాప్‌టాప్’ ధర ఆధారపడి ఉంటుందని జియో అధికార వర్గాలు చెబుతున్నాయి. జియో క్లౌడ్ బ్యాక్ ఎండ్ కేంద్రంగా ‘జియో క్లౌడ్ లాప్‌టాప్ రూపుదిద్దుకోనున్నది. ఫలితంగా అత్యధిక శక్తి, సామర్థ్యాలతో కూడిన హార్డ్ వేర్ వల్ల సాధారణంగా ధర పెరుగుతుంది. కానీ ఈ లాప్ టాప్ ధర తగ్గుతుందని చెబుతున్నారు.రిలయన్స్ జియో పర్సనల్ కంప్యూటర్ యూజర్ల కోసం ‘క్లౌడ్ పీసీ’ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తెస్తున్నది. దీని టారిఫ్ ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. కొత్త కంప్యూటర్లు కొనలేని వారు అన్ని రకాల కంప్యూటర్ సర్వీసులు పొందేలా క్లౌడ్ మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఉంటుందని తెలుస్తోంది. గత జూలై 31న రిలయన్స్ జియో తొలి లెర్నింగ్ బుక్.. జియో బుక్ లాప్ టాప్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

రాబోయే వారంలో ఐదు ఐపీఓలు

ఐపీఓ మార్కెట్‌ వచ్చేవారం బిజీగా ఉండనుంది. ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (Public Issue)కు వస్తున్నాయి. మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్‌, ప్రభుత్వ రంగ ఐఆర్‌ఈడీఏ సహా మరో మూడు కంపెనీలు రూ.7,300 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి.ఈ ఏడాది ప్రథమార్ధంలో ఇప్పటి వరకు 31 కంపెనీలు ఐపీఓ (IPO)కి వచ్చాయి. రూ.26,300 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం తగ్గుదల నమోదైంది. 2022- 23 తొలి ఆరు నెలల కాలంలో 14 ఐపీఓ (IPO)లు రూ.35,456 కోట్లు సమీకరించాయి. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం చాలా కంపెనీలు మంచి ధర వద్ద పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నాయని ఆనంద్‌ రాఠీ అడ్వైజర్స్‌ ప్రతినిధి ప్రశాంత్‌ రావ్‌ తెలిపారు.

వెండి నగలు అమ్మే ఒరాఫో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెండి నగలు అమ్మే ఒరాఫో  శనివారం ఈ–కామర్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. కన్జూమర్లు ఒరాఫోజ్యుయెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి సిల్వర్ నగలను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా బలగం మూవి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావ్య కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. ఒరాఫో జ్యుయెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోమాజిగూడా, సుచిత్ర ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సొంత షారూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని, ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రాంచైజీ బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ స్టోర్ ఉందని  కంపెనీ  డైరెక్టర్ కళ్యాణ్ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.5.75 కోట్ల రెవెన్యూని ఇంకో మూడేళ్లలో  రూ.50 కోట్లకు పెంచాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z