Devotional

కార్తీక గోపాష్టమి విశిష్టత

కార్తీక గోపాష్టమి విశిష్టత

ఈరోజు గోపాష్టమి_

చిన్ని కృష్ణుడు తన ఐదవఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శు. అష్టమి. శ్రీ కృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును ‘ గోపాష్టమి’ పర్వదినంగా జరుపుకుంటాము.

గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి.

ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్ఠతను తెలియజేయాలి. పంచగవ్య ప్రసాదాన్నివితరణ చేయాలి.

గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. గోశాలలను శుభ్రపరచి , గోవులను అలంకరించి విశేషపూజలను జరుపాలి. గో ఉత్పత్తుల తయారీ , ప్రదర్శన , విక్రయాలకు ప్రారంభించాలి.

‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’ అనగా ‘గోప బాలుడు’. కార్తిక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని ‘గోపాష్టమి’ గా పిలుస్తారు.

గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి , గోవు యొక్క పృష్ట భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత ‘సురభీదేవి’. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ ‘శ్రీసురభ్యై నమః’ అనే మంత్రాన్ని జపించి , క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే , ఆయురారోగ్యైశ్వర్యాలు , అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి , ధనము , జ్ఞానము , క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఈ ‘గోపాష్టమి స్తుతి’. (దేవీ భాగవతం అంతర్భాగంగా)

గోపాష్టమి స్తుతి:

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం!
గవామధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్!!

పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం!
యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ్!!

నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః!
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే!!

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః!
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః!!

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే!
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః!!

శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః!
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః!!

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z