తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల (Telangana News) ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా (Amit shah) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో నిర్వహించిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్‌షా పాల్గొన్నారు. ఎన్నికల్లో భాజపాను (BJP) ప్రజలు గెలిపించాలని కోరారు.
‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి హైదరాబాద్ (Hyderabad) రాష్ట్రం విముక్తి పొందింది. ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్ (KCR) విమోచన దినోత్సవాలు జరపడం లేదు. భాజపా ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం. బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తాం. భారాస, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు. భాజపా తెలంగాణ ప్రజల పార్టీ. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారు’’ అని అమిత్ షా తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –