WorldWonders

అత్యధిక దంతాలు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు

అత్యధిక దంతాలు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు

కోపం వచ్చినప్పుడు ఎవరైనా.. ‘‘కొడితే ముప్పై రెండు పళ్లు రాలతాయ్’’.. అని అంటుంటారు. ఎవరికైనా 32 పళ్లు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరికి మాత్రం వివిధ కారణాల వల్ల ఇంకా తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మమిళకు మాత్రం 32 కంటే ఎక్కువ పళ్లు ఉన్నాయి. ప్రపంచలోనే అత్యధిక పళ్లు ఉన్న మహిళగా ఈమె గిన్నిస్ బుక్ రికార్డుల్లోకీ ఎక్కింది. ఇంతకీ ఈమెకు ఎన్ని పళ్లు ఉన్నాయంటే..

సాధారణంగా ఎవరికైనా చిన్న వయసులో పాల దంతాలు వస్తాయి. ఎనిమిదేళ్ల వయసులో అవన్నీ క్రమక్రమంగా ఊడిపోయి శాశ్వత దంతాలు (Permanent teeth) వస్తాయి. అప్పటికి మొత్తం 28 పళ్లు ఉంటాయి. అయితే యుక్త వయసు రాగానే జ్ఞానదంతాలు రావడంతో మొత్తం 32 ఉంటాయి. అయితే కల్పనా బాలన్ అనే 28 ఏళ్ల మహిళకు ఏకంగా 38 పళ్లు (woman has 38 teeth) ఉన్నాయి. ఆమె దిగువ దవడపై పళ్ల పక్కనే అదనంగా నాలుగు పళ్లు, పై దవడపై మరో రెండు పళ్లు వచ్చాయి.

ఆమె యుక్త వయసుకు రాగానే అదనపు దంతాలు రావడం చూసి వైద్యులను సంప్రందించింది. అయితే పళ్లు పూర్తిగా వచ్చిన తర్వాత తొలగిస్తామని వైద్యులు చెప్పడంతో అలాగే ఉండిపోయింది. అయితే పూర్తిగా వచ్చిన తర్వాత వాటి వల్ల ఎలాంటి నొప్పి గానీ, హానీ కానీ లేకపోవడంతో తొలగించే అవకాశం లేకుండా పోయింది. మొత్తం 38 పళ్లు ఉండడంతో ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. దీంతో ఈమె గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈమె ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z