హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. భారీ ధర పలికినందుకు ఆ గేదె యజమాని నోట్లతో తయారు చేసిన మాలవేసి దానికి ఘనంగా వీడ్కోలు పలికాడు. ‘‘ఈ గేదె రోజుకి 26 లీటర్ల పాలు ఇస్తుంది. దీన్ని అంతకుముందు మా గ్రామానికి చెందిన వికాస్ వద్ద రూ.78 వేలకు కొన్నాను. ఆ తర్వాత గేదె తినే ఆహారం ఇతర విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నాను. ప్రస్తుతం దీని వయసు ఆరేళ్లు. ఇప్పుడు మా గ్రామవాసి మల్వీంద్ర అనే వ్యక్తి రూ.4.60 లక్షలతో దీన్ని కొనుగోలు చేశాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత ఖరీదైన గేదె ఇదే’’ అని యజమాని రణవీర్ షియోరాన్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –