Politics

వచ్చే నెలలో విదేశాలకు రాహుల్

వచ్చే నెలలో విదేశాలకు రాహుల్

వచ్చే నెలలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశాలకు వెళ్లనున్నారు. ఆయన పలు ఆసియా దేశాల్లో పర్యటించనున్నారని సమాచారం. డిసెంబర్‌ నాలుగు నుంచి శీతాకాల సమావేశాలు(Winter Session of Parliament) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పర్యటన గురించి వార్తలు వచ్చాయి.

‘డిసెంబర్ 9 నుంచి రాహుల్ గాంధీ ఇండోనేషియా, సింగపూర్‌, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటిస్తారు. సింగపూర్‌, మలేషియాలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఇండోనేషియాలో దౌత్యవేత్తలతో భేటీ అవుతారు. అలాగే వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది’ అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్‌ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కొద్దిరోజుల క్రితం తెలిపారు. డిసెంబర్‌ 22 వరకు సెలవులు మినహాయించి 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో రాహుల్‌ విదేశాలకు వెళ్తుండటం గమనార్హం. గతంలోనూ భారత్‌లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ.. ఆయన విదేశాల్లో పర్యటించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z