Politics

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ అమలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో 144 సెక్షన్ అమలు

తెలంగాణలో ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ప్రచార గడువు ముగియడంతో సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని చెప్పారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముందని స్పష్టం చేశారు. మంగళవారం (నవంబర్ 28న) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని చెప్పారు. టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం అని తెలిపారు. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదన్నారు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం అని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది ఓటు వేశారని వికాస్‌రాజ్‌ చెప్పారు.

ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ ఆదేశాలు ఇవి :
* తెలంగాణలో సైలెన్స్ పిరియడ్ మొదలైంది : సీఈవో వికాస్ రాజ్
* సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
* రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్
* ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంగించినా చర్యలు తప్పవు
* ఎలాంటి ఎన్నికల మెటీరియల్ ను ప్రదర్శించరాదు
* పోలింగ్ బూతుల దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు
* సినిమా హాల్, సోషల్ మీడియాలో ప్రచారాలు బంద్
* స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లాలని ఈసీ ఆదేశం
* పోలింగ్ బూత్ లకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు
* అభ్యర్థితో పాటు ఒకే వాహనానికి అనుమతి ఉంటుంది
* పార్టీ, అభ్యర్థి పేరు లేకుండా ఓటర్ స్లిప్పులు పంచాలి
* పోలింగ్ వాహనాలను కూడా ఏజెంట్లు ఫాలో కావొచ్చు
* ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు
* ఇప్పటికే 27 వేల 178 మంది తొలిసారి ఇంటి నుంచి ఓట్లు వేశారు
* 27 వేల పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్
* మొత్తం 45 వేల 600 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
* ఎన్నికల విధుల్లో లక్షా 40 వేల మంది సిబ్బంది
* పోలింగ్ కేంద్రానికి ఓటర్ స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z