Food

ట్రెండింగ్‌లో ఉన్న రోస్టెడ్ మిల్క్ టీ

ట్రెండింగ్‌లో ఉన్న రోస్టెడ్ మిల్క్ టీ

టీ లేనిదే దేశీ ఇండ్ల‌లో రోజు గ‌డ‌వ‌దు. తేనీరు వేడిగా గొంతులో దిగితే ఆ మ‌జా వేరని తేనీటి ప్రియులు చెబుతుంటారు. ఇక డిజిట‌ల్ యుగంలో దేశీ డ్రింక్ కొత్త రూపు సంత‌రించుకుంటోంది. రోస్టెడ్ మిల్క్ టీ (Roasted milk tea) ప్ర‌స్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

స్పైసెస్‌తో టీ ఆకుల‌ను బాయిల్ చేసే ప‌ద్ధ‌తి స్ధానంలో ఈ వినూత్న ప‌ద్ధతిలో వాటిని రోస్ట్ చేస్తారు. ఈ ట్రెండ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఇది దేశీ తేనీటి ఔత్సాహికుల మ‌ధ్య చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఫుడ్ మ్యాడ్‌నెస్ అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ఇన్‌స్టా రీల్‌ను నెట్టింట పోస్ట్ చేసింది. ఈ వినూత్న ప్రిప‌రేష‌న్ వీడియో ఇప్పుడు హాట్ డిబేట్‌కు కేంద్ర బిందువైంది.

ఈ టీ త‌యారు చేసే క్ర‌మంలో తేయాకు, షుగ‌ర్‌, యాల‌కుల‌ను ప్యాన్‌పై థిక్ పేస్ట్‌గా అయ్యేంత వ‌ర‌కూ రోస్ట్ చేయాలి. ఆపై ఈ మిశ్ర‌మంలో పాలు పోసి మ‌ర‌గ‌నివ్వాలి. టీ సిద్ధ‌మైన త‌ర్వాత వేడివేడిగా స‌ర్వ్ చేస్తే సంప్ర‌దాయ టీ కంటే సువాస‌న‌తో టేస్టీగా త‌యార‌వుతుంద‌ని చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z