Sports

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం

ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. రాయ్‌పూర్‌ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనికి కారణం కరెంట్ బిల్లు కట్టకపోవడమే.. రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు కట్టలేదు. ఐదేళ్ల కిందటే ఈ స్టేడియానికి కరెంట్ కనెక్షన్ కట్ చేశారు విద్యుత్ అధికారులు. ఇప్పుడు కూడా ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ మ్యాచ్ కోసం తాత్కలికంగా గ్యాలరీలకు మాత్రమే కనెక్షన్ ఇచ్చారు. ప్లడ్ లైట్స్ కోసం జనరేటర్లు వాడుతున్నారు.

స్టేడియం నిర్మాణం తర్వాత దాని నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి)కి అప్పగించబడింది, మిగిలిన ఖర్చులను క్రీడా శాఖ భరించాలి. కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో రెండు శాఖలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. బకాయిల క్లియరెన్స్ కోసం విద్యుత్ సంస్థ పిడబ్ల్యుడి, క్రీడా శాఖకు అనేకసార్లు నోటీసులు పంపింది, కానీ వారు చెల్లించలేదు. 2018లో కరెంట్ కనెక్షన్‌ నిలిపివేసినప్పటి నుండి స్టేడియంలో మూడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి.

శుక్రవారం జరిగే ఈ నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా 2–1 లీడ్‌‌‌‌లో ఉంది. అయితే బౌలింగ్‌‌‌‌ ఫెయిల్యూర్స్‌‌‌‌తో మూడో టీ20లో ఓడిన ఇండియా.. ఈ మ్యాచ్‌‌‌‌ గెలిచి సిరీస్‌‌‌‌ను పట్టేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంటే.. లెక్క సరి చేయాలని కంగారూలు ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లకు మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. డెత్ ఓవర్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ పర్ఫెక్షన్‌‌‌‌ కోసం ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌లో బౌలర్లను మార్చే చాన్స్‌‌‌‌ ఉంది.

జట్లు (అంచనా):
ఇండియా: సూర్య కుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), యశస్వి, రుతురాజ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, రింకూ సింగ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ / దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ / అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ఆరోన్‌‌‌‌ హ్యార్డీ, ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌, మాథ్యూ షార్ట్‌‌‌‌, బెన్‌‌‌‌ మెక్‌‌‌‌డెర్మాట్‌‌‌‌, టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గ్రీన్‌‌‌‌, బెన్‌‌‌‌ డ్వారిషస్‌‌‌‌, నేథన్‌‌‌‌ ఎలిస్‌‌‌‌, బెరెన్‌‌‌‌డార్ఫ్‌‌‌‌, తన్వీర్‌‌‌‌ సంగా.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z