ScienceAndTech

వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్

వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్

యూజ‌ర్ల ప్రైవ‌సీకి వాట్సాప్ మేజ‌ర్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్‌ను (WhatsApp New Secret Code) లాంఛ్ చేసింది. వాట్సాప్‌లో ఇప్ప‌టికే త‌మ వ్య‌క్తిగ‌త చాట్స్‌ను యూజ‌ర్లు లాక్ చేసుకునే స‌దుపాయం ఉన్నా అందులో లోటుపాట్లు ఉండ‌టంతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ నూత‌న ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

యూజ‌ర్లంద‌రికీ వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా భ‌ద్ర‌తను అప్‌గ్రేడ్ చేసింది. న్యూ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్‌తో యూజ‌ర్లు త‌మ‌ చాట్స్‌కు వ‌ర్డ్స్‌, ఎమోజీల‌తో యూనిక్ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. సెర్చ్ బార్‌లో కేవ‌లం సీక్రెట్ కోడ్‌ను టైప్ చేసి లాక్డ్ చాట్స్‌ను యాక్సెస్ చేసేలా సెట్టింగ్స్‌ను సెట్ చేసే వెసులుబాటు ఉంది.

వాట్సాప్‌లో చాట్ లాక్ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్ ఎంట్రీతో యూజ‌ర్లు యూనిక్ పాస్‌వ‌ర్డ్‌తో వారి చాట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని మెటా సీఈవో పేర్కొన్నారు. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ టైప్ చేసిన‌ప్పుడే లాక్డ్ చాట్స్ క‌నిపించేలా యూజ‌ర్ సెట్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌తో ఏ ఒక్క‌రూ యూజ‌ర్ల ప్రైవేట్ సంభాష‌ణ‌ల‌ను గుర్తించ‌లేర‌ని వాట్సాప్ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z