బీఆర్ఎస్ లీడర్లు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో తనను చాలా ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘బీఆర్ఎస్నేతలు నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగుల్తది. రాష్ట్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే’ అని సీతక్క తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –