అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి రాష్ట్రస్థాయిలో అవార్డులతో గౌరవించనున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ తెలిపారు. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈ నెల 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలి
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళల మాదిరే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ కె.వాసుదేవరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో 6 లక్షల మంది దివ్యాంగులు పింఛను పొందుతున్నారని, వీరికి బస్సుల్లో ఇప్పటికే 50 శాతం రాయితీ ఉందని గుర్తుచేశారు. వీరందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
👉 – Please join our whatsapp channel here –