DailyDose

8 వేలకు పైగా అంగన్‌వాడీ ఉద్యోగాలు

8 వేలకు పైగా అంగన్‌వాడీ ఉద్యోగాలు

తెలంగాణలో 8,815 అంగన్‌వాడీ పోస్టులు(Anganwadi Vacancy) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్‌వాడీ వర్కర్స్‌, 7,038 హెల్పర్‌ పోస్టులు(Anganwadi jobs) ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మనుషులను తరలించే నకిలీ ఏజెంట్లు తెలంగాణలో 113 మంది, ఏపీలో 471 మంది ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గత అక్టోబర్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 2,925 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌లో వారి పేర్లను వెల్లడించినట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z