Videos

‘కెప్టెన్‌ మిల్లర్‌’ ట్రైలర్‌

‘కెప్టెన్‌ మిల్లర్‌’ ట్రైలర్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ తెలుగులో విడదల కావడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్‌ నటీనటులు ఇందులో నటించారు.

తాజాగా కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్‌ విడుదలైంది. ధనుష్‌తో పాటు చిత్ర బృందం కూడా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమ ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్‌ నటించాడు.

ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. దీంతో పార్ట్‌-2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్‌ వచ్చింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z