Politics

ముగిసిన ప్రజాపాలన కార్యక్రమం

ముగిసిన ప్రజాపాలన కార్యక్రమం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. అభయహస్తం కింద ఇప్పటివరకు సుమారుగా కోటి 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గృహలక్ష్మీ, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రూ.500కే సిలిండర్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5లక్షల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రూ.4వేల పింఛన్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. గత నెల 28వ తేదీ నుంచి ఇవాళ సాయంత్రం వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z