ప్రముఖ వేరెబుల్స్ తయారీ సంస్థ నాయిస్ (Noise) కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను (TWS earbuds) భారత్‌లో లాంచ్ చేసింది. నాయిస్ బడ్స్ కాంబాట్ ఎక్స్ (Noise Buds Combat X) పేరిట దీన్ని తీసుకొచ్చింది. వీటి ధర రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది. షాడో గ్రే, థండర్ బ్లూ, కోవర్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయని, ఫ్లిప్‌కార్ట్, నాయిస్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది.
నాయిస్ కొత్త ఇయర్‌బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే.. అతి పెద్ద బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ఇయర్‌బడ్స్ 60 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో గంటన్నర మ్యూజిక్ వినొచ్చని కంపెనీ తెలిపింది. ఇది బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ ఆడటానికి వీలుగా 40ms లాటెన్సీ గేమింగ్ మోడ్‌ను ఇచ్చారు. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్‌ను ఉపయోగించారు. IPX5 రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది. స్పాషియల్ లైట్, ఆర్‌జీబీ లైట్.. ఫీచర్లు ఉన్నాయి. క్వాడ్ మైక్రోఫోన్ సెటప్ ఇచ్చారు. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసిన వారికి రూ.2,499కే అందిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –