Devotional

వారఫలాలు:07-01-2024 నుండి 13-01-2024

వారఫలాలు:07-01-2024 నుండి 13-01-2024

మేషం

ఈ రాశిలో గురువు, లాభస్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం, పరివర్తన యోగం వంటి అనుకూలతల కారణంగా ఈ వారం తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం

లాభ స్థానంలో రాహువు, దశమ స్థానంలో శనీశ్వరుడు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడుతాయి. తల పెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం

లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి, బుధ, కుజుల సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఈ రాశివారికి ఈ వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. విద్యా ర్థులు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి.

కర్కాటకం

పంచమ స్థానంలో శుక్రుడు, దశమ, లాభస్థానాల్లో రాశ్యధిపతి చంద్రుడు తదతర గ్రహ మార్పుల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతుంది. సామా జికంగా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగిన ప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

సింహం

అష్టమంలో ఉన్న రాహువు తప్ప మిగిలిన గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ సఫలం అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం, ప్రతిఫలం ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందు కుంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడి నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి.

కన్య

ఆరవ స్థానంలో శనీశ్వరుడు, నాలుగవ స్థానంలో రవి, బుధుల కారణంగా వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరు లకు వీలైనంతగా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు తీసు కునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి.

తుల

సప్తమంలో గురువు, ధన స్థానంలో శుక్రుడు, ఆరవ స్థానంలో రాహువు వల్ల ప్రతి విషయంలోనూ విజయాలు, ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీకు తిరుగుండదు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి, ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాల.క్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థుల్ని విజయాలు వరిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం

ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడిన కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన రాణింపు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్త వుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలి తాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు

రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి కుజుడికి పరివర్తన జరగడం, ఇదే రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం, శనీశ్వరుడు తృతీయంలో ఉండడం వల్ల దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయ వంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.

మకరం

ధన స్థానాధిపతి శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉండడం, తృతీయంలో రాహువు, లాభస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి ఈ వారం ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారో గ్యాలకు సంబంధించి అనుకోకుండా సరైన వైద్య సహాయం, చికిత్స లభిస్తాయి. కుటుంబ వ్యవహా రాలను జీవిత భాగస్వామితో కలిసి పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మధ్య మధ్య చికాకులుంటాయి.

కుంభం

దశమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో బుధ, రవి, కుజులు ఉండడం వల్ల అనేక సానుకూల పరిణామాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకా రాలు లభి స్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరి ష్కారమవుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపో తాయి.

మీనం

ధన స్థానాధితి కుజుడితో ధనస్థానాధిపతి గురువుకు పరివర్తన ఏర్పడడం, దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల సర్వత్రా మీ ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు అందుతాయి. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి కూడా ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా బాధ్యతలు నిర్వర్తి స్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండ వద్దు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z