వేసవిలో భారతీయులు ఇష్టంగా తాగే మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డైరీ డ్రింక్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 అవార్డ్స్‌లో మ్యాంగో లస్సీ చోటు దక్కించుకుంది. పెరుగు, తాజా మామిడి మిశ్రమంగా మ్యాంగో లస్సీని తయారు చేస్తారు.
16 డైరీ డ్రింక్స్‌లో భారత్‌కు చెందిన మ్యాంగో లస్సీ ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. మ్యాంగో లస్సీలో రుచి, ఫ్లేవర్ కోసం యాలకులు, నీరు, చక్కెరను కలిపి రుచికరమైన పానీయంగా తయారుచేస్తారు. టేస్ట్ అట్లాస్ అవార్డ్ ప్రకటించిన అనంతరం మ్యాంగో లస్సీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
లస్సీ సూపర్‌మసీ అని నెటిజన్ ప్రశంసించగా, మ్యాంగో లస్సీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. అల్ఫాన్సో మ్యాంగో నుంచి తయారైన లస్సీ అత్యుత్తమైనదని మరో యూజర్ కామెంట్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –