Movies

14.25 లక్షల విరాళం ఇస్తున్న ‘హను-మాన్‌’ టీమ్‌

14.25 లక్షల విరాళం ఇస్తున్న ‘హను-మాన్‌’ టీమ్‌

సినిమా విడుదలకు ముందే చెప్పిన మాటను ‘హను-మాన్‌’ (Hanu- Man) చిత్ర బృందం నిలబెట్టుకుంది. ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. టికెట్‌కు రూ. 5 చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శితమైనంత కాలం విరాళం ఇవ్వనున్నట్లు పేర్కొంది. వెబ్‌సైట్‌ రూపొందించి సంబంధిత వివరాలు అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు.

‘జాంబీరెడ్డి’ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ- నటుడు తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హను-మాన్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి, హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. అమృత అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రల్లో మెప్పించారు. కోటి అనే వానర పాత్రకు ప్రముఖ హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథ ఇది. విజువల్స్‌, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z