Kids

పిల్లలు పుట్టట్లేదా? కార్ సీట్ కూడా కారణమే!

పిల్లలు పుట్టట్లేదా? కార్ సీట్ కూడా కారణమే!

సంతాన లేమి సమస్యతో భాధ పడుతున్న దంపతుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైంది. అందుకే ప్రతి నగరంలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే తాజాగా ఇంగ్లండ్‌ శాస్త్రజ్ఞులు సంతాన లేమికి కారు సీటు కూడా కారణం కావచ్చని గుర్తించారు. మాంచెస్టర్‌ యూనివర్సిటీలోని అండ్రాలజీ ప్రొఫెసర్‌ అలన్‌ పేషీ తెలిపిన వివరాల ప్రకారం సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలి. కారులో లేదా బైకుపై ప్రయాణించేటప్పుడు పురుషులు కూర్చునే సీటు వేడిగా ఉండటం వల్ల వృషణాలలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నది. బిగుతైన ప్యాంటు ధరించడం లేదా కారు లేదా ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని పరిశోధనలలో తేలింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z