Food

ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన బాస్మతి బియ్యం

ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన బాస్మతి బియ్యం

రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్‌లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్‌, పాకిస్థాన్‌లలో పండిస్తుంటారు. బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి మంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికో ప్రత్యేకతను చేకూరుస్తాయి.

ఎలాంటి కూరలు, సాస్‌లు, సూప్‌లు ఇతర పదార్ధాలలోనైనా దీనిని సులభంగా కలుపుకుని తినవచ్చు. ఇక బాస్మతి బియ్యంతో తయారు చేసే బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్నారు. బాస్మతి తర్వాత రెండో స్థానంలో ఇటలీకి చెందిన అర్బోరియా, మూడో స్థానంలో పోర్చుగల్‌కు చెందిన కరోలినా బియ్యం నిలిచాయి. ఇక నాలుగైదు, స్థానాలను స్పెయిన్‌, జపాన్‌ బియ్యం దక్కించుకున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z