Agriculture

ఎగుమతులపై కొనసాగుతున్న ఆంక్షలు

ఎగుమతులపై కొనసాగుతున్న ఆంక్షలు

గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేసే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) స్పష్టం చేశారు. అలాగే గోధుమలు, పంచదారను దిగుమతి చేసుకునేదీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దేశంలో పెరుగుతున్న ధరల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అనేకమార్లు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ వచ్చింది. 2022 మే నెలలో గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. 2023 జులై నుంచి బాస్మతీయేతర ఎగుమతులపై, 2023 అక్టోబరులో పంచదార ఎగుమతులపై ఆంక్షల్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ మూడింటిపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z