Movies

విజయ్ సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

విజయ్ సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘లియో’ (LEO). ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్ర‌స్తుతం విజ‌య్ చేస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు(Venkat Prabhu)దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ సాగుతోంది.

ఇదిలావుంటే.. పోంగ‌ల్ కానుక‌గా ఈ సినిమా నుంచి మ‌రో కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్‌తో పాటు డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవా, తమిళ న‌టుడు ప్ర‌శాంత్, అజ్మ‌ల్ అమీర్ ఉన్నారు. వీళ్ళందరూ గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు.

GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z