స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఆయన సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –