* కొడాలి నానికి చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
టీడీపీ, జనసేన గెలుపు అన్ స్టాపబుల్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుడివాడలో టీడీపీ ‘రా. కదలిరా’ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టారని, కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ దుర్మార్గులు గుడివాడకు క్యాసినో తీసుకొచ్చారని విమర్శించారు. ఎవరినీ వదిలిపెట్టేదిలేదని, త్వరలోనే వారి కథ చెబుతానని హెచ్చరించారు. బూతులు మాట్లాడితేనే వైసీపీలో పదవులు వస్తాయన్నారు. సంక్రాంతి పేరు చెప్పి ఓ వ్యక్తి పెన్షన్ల కొట్టేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలు చేసేది దుర్మార్గాలని, అలాంటి నీతి మాలిన వాళ్లకు ఓటు వేయొద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్కీములు కూడా రద్దు చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని విమర్శించారు. పెట్రోల, డీజిల్ ధరలు, పన్నులు పెంచేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోయిందని చెప్పారు. చెత్తపై కూడా పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వం రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు.
* ఖమ్మం జిల్లాలో కుప్పకూలిన గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి
ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి కుప్పకూలింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* MLC ఎన్నికలపై బీజేపీ ఫోకస్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధిష్టానం దృష్టి సారించింది. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌కు నోటిఫికేషన్ రావడంతో బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు.. ఈ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ కోసం బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్నీ షురూ చేసింది. దీనికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ ఎమ్మెల్సీ రేసులో గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.అయితే.. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. మళ్లీ ఇప్పటివరకు ఈ ఎన్నికపై దృష్టి పెట్టలేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం భారీగా పెరగడంతో ఒక్కసారిగా జోరు పెంచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
* ఎన్టీఆర్ సిద్ధాంతాలను ట్రస్ట్ పాటిస్తోంది
ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్ ట్రస్ట్’ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు.
‘‘ఎన్టీఆర్ సిద్ధాంతాలను ట్రస్ట్ పాటిస్తోంది. ఆయన వర్ధంతికి ఏటా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ట్రస్ట్ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక సేవ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని భువనేశ్వరి అన్నారు.
* ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులే హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరుబోతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. దీనికి కారణం ఇవాళ ఉదయం ఎమ్మెల్యే ఇంటికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావడమే. మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వామి గౌడ్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో మైలార్‌దేవుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన వెంట ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగిందని సమాచారం. ప్రకాశ్‌గౌడ్, స్వామి గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మంత్రి కోరినట్లు తెలుస్తున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం తెలంగాణలో చర్చకు దారితీసింది. వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లేందుకు ఆయన సమావేశమైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ తాజా పరిణామాలు త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.మంత్రులందరూ త్వరలోనే మినిస్టర్ క్వార్టర్స్‌కు షిఫ్ట్ అవుతున్నారని, తర్వాత వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. అన్ని దేవాలయాల్లో ఆయా సంఘాల భవనాలు ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ నేతలతో సమావేశం మర్యాదపూర్వక భేటీ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పడం గమనార్హం.
* రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం
సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్‌లో వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో భాగంగా ‘ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్’ అనే అంశంపై రేవంత్ మాట్లాడారు.‘‘భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయి. బ్యాంకు రుణాలు రాక.. ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు సరైన లాభాలు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు అర్థం చేసుకోగలను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం. అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –