DailyDose

భర్త జీతం గురించి తెలుసుకునే హక్కు భార్యకు ఉంది!

భర్త జీతం గురించి తెలుసుకునే హక్కు భార్యకు ఉంది!

వైవాహిక వివాదాల విషయంలో భరణం కోరేందుకు తన భర్త జీతం వివరాలను తెలుసుకునేందుకు భర్యకు హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంపై పిటిషన్ వేసిన బాధిత మహిళకు అనుకూలంగా తీర్పును వెలువరించింది మద్రాసు హైకోర్టు. భర్త జీతం వివరాలు తెలుసుకోవాలిన బాధిత మహిళ రాష్ట్ర సమాచార కమిషనర్ ఆశ్రయించారు. అయితే దీనిపై ఎలాంటి వివరాలు ఇవ్వకూడదని రాష్ట్ర సమాచార కమిషనర్‎ను భర్త కోరినట్లు పిటిషన్ దాఖలు చేసింది ఎస్ఐసి. భర్త అభ్యర్థనను తిరస్కరిస్తూ సమాచార కమిషనర్ అధికారులు వేసిన పిటిషన్‎ను కోర్టు సమర్థించింది. ఇక అసలు విషయానికొస్తే.. భార్యాభర్తలు పరస్పర గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తన నెలవారి నిర్వహణ ఖర్చుల కోసం భరణం ఇవ్వాలని భర్తను కోరింది. ఈ క్రమంలోనే భర్త జీతం ఎంత అనే విషయాన్ని తెలుసుకునేందుకు సమాచార కమిషనర్ ను ఆశ్రయించారు. అయితే వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన భర్తకు కోర్టులో చుక్కెదురైంది.

ఈ వ్యవహారం మొత్తం 2020లో జరిగింది. అదే సమయంలో పిటిషన్ వేసిన బాధితురానికి ఇటీవలే న్యాయం జరిగింది. భార్య భర్తలు విడిపోయినప్పుడు భరణం అనేది సాధారణమైన అంశం. అయితే భర్త జీతం ఎంతో తెలిస్తేనే అందులో కొంత మొత్తం భరణంగా నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. అదే తెలియని పక్షంలో భరణాన్ని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో భర్త జీతం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుందని గతంలో మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది హైకోర్టు. జస్టిస్ స్వామినాథన్‎తో కూడిన ధర్మాసనం భార్యా, భర్తల మధ్య వివాహ వ్యవహారాలు పెండింగ్లో ఉన్నందున అతని భార్యకు చెల్లించే భరణం మొత్తాన్ని పిటిషనర్ ఆదాయం నిర్ణయిస్తుందని తెలిపింది. దీంతో పిటిషనర్ అయిన భర్త జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు తన భార్యకు తెలియజేయాలని సూచిందింది. లేకపోతే ఆమె చేసుకోవల్సిన క్లైయిమ్ మొత్తాన్ని నిర్ణయించడంలో సమస్య తలెత్తుతుందని పేర్కొంది. ఈ సంచలన తీర్పుతో చాలా మంది వైవాహిక జీవితాల్లో తలెత్తే భరణం సమస్యలపై ఒక స్పష్టత వచ్చినట్లైంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z