Movies

ఆ అసాధ్యమైన ప్రేమ చివరి వరకు నిలుస్తుందా?

ఆ అసాధ్యమైన ప్రేమ చివరి వరకు నిలుస్తుందా?

ఒక సాధారణ వ్యక్తి తెలియకుండా రోబోతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపించేందుకు ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ సినిమా సిద్ధమవుతోంది. షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. అమిత్‌ జోషి, ఆరాధన సాహ్‌ దర్శకత్వంలో జియో స్టూడియోస్‌, మడోక్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘అన్ని భాషలు మాట్లాడతావు. అన్ని రకాల వంటలు చేస్తావు. కానీ, ఏమీ తినవు. నువ్వు అమ్మాయివా లేక అల్లావుద్దిన్‌ దీపమా…’ అంటూ మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం వినోదాన్ని పంచింది. సూపర్‌ ఇంటెలిజెంట్‌ ఫీమేల్‌ రోబోట్‌ ఆటోమేషన్‌.. సిఫ్రా పాత్రలో కృతి చేసిన కామెడీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘సిఫ్రా రోబో అని తెలిసినా తన మీద నాకున్న ప్రేమ చావట్లేదు’ అంటూ షాహిద్‌, ‘రోబోగా జీవించడం చెడ్డ విషయమా’ అంటూ కృతి సంభాషణలు చిత్రం పట్ల ఆసక్తిని కలిగిసున్నాయి. మరి షాహిద్‌ రోబోని అలాగే ప్రేమిస్తాడా? వారిద్దరి మధ్య ఉన్న ఆ అసాధ్యమైన ప్రేమ చివరి వరకు నిలుస్తుందా? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ సినిమాని చూడాలంటున్నాయి సన్నిహిత వర్గాలు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z