‘డంకీ’ చిత్రంతో ఇటీవల చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది పంజాబీ సుందరి తాప్సీ. ప్రస్తుతం సక్సెస్ జోష్లో ఉన్న ఈ భామ తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అలాంటి కథలో తాను నటించలేనని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘ఇతర నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చింది వారు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నటీనటులందరికి ప్రతిభా పాటవాలతో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని గౌరవిస్తూ నేను ముందుకు సాగుతాను. వ్యక్తిగతంగా మాత్రం నేను ఆ తరహా కథల్లో నటించలేను’ అని చెప్పుకొచ్చింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z