Health

అయిదేళ్ల పాపకు గుండెపోటు

అయిదేళ్ల పాపకు గుండెపోటు

ఫోన్‌లో కార్టూన్లు చూస్తున్న ఐదేండ్ల బాలిక హఠాత్తుగా గుండె పోటుతో మరణించింది! ఈ షాకింగ్‌ ఘటన యూపీలోని అమ్రోహ జిల్లా హతాయిఖేడాలో ఆదివారం జరిగింది. కామిని తన తల్లి పక్కన పడుకొని ఫోన్‌ చూస్తుండగా హఠాత్తుగా అచేతనంగా మారిపోయింది. వెంటనే బాలికను ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్ల బాలిక చనిపోయి ఉండొచ్చని చెప్పారు. అయితే శవపరీక్షకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మరణానికి గల కచ్చితమైన కారణం తెలియలేదు. అమ్రోహ, బిజ్నర్‌ జిల్లాల్లో ఇటీవల డజనుకు పైగా పిల్లలు, ఒక యువకుడు గుండెపోటుతో చనిపోయారు. ‘చలి వాతావరణం గుండెపోటుకు కారణం కావొచ్చు. ఈ వాతావరణంలో ఆక్సిజన్‌ స్థాయిలు, రక్తపోటు సాధారణంగా పడిపోయి రక్తం గడ్డ కట్టే అవకాశాన్ని పెంచుతాయి’ అని సీనియర్‌ ఫిజిషియన్‌ రాహుల్‌ బిష్ణోయ్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z