NRI-NRT

బాపట్ల జిల్లాలో నాట్స్ గ్రామాభివృద్ధి పనులు

బాపట్ల జిల్లాలో నాట్స్ గ్రామాభివృద్ధి పనులు

నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఆధ్వర్యంలో రూపొందించిన “మన గ్రామం.. మన బాధ్యత”లో భాగంగా తన స్వగ్రామంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల సేవా కార్యక్రమాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. తన సొంత నిధులతో రోడ్లను బాగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో చెరువు కట్టపై ఉన్న తుమ్మ చెట్లను తొలిగించి ప్రజలు నడవటానికి వీలుగా రోడ్ల వేయిస్తున్నారు. నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో)ల సంయుక్త సహకారంతో రాజేంద్ర మాదాల చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబడిపూడి గ్రామంతో పాటు, మండలంలోని గుంటుపల్లి, బల్లికురవ, కొత్తపాలెం గ్రామాలలో కూడా నాట్స్ చొరవ తీసుకొని రోడ్లు విస్తరణ, చెట్లు తొలగింపు, చెరువులు బాగుచేయటం వంటి కార్యక్రమాలను చేపడుతుందని బాపు తెలిపారు. స్వగ్రామాభివృద్ధికి ముందుకొచ్చిన నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z