Movies

“కుర్చీ మడతపెట్టే” తాతను మడతపెట్టిన యూసుఫ్‌గూడ పోలీసులు

“కుర్చీ మడతపెట్టే” తాతను మడతపెట్టిన యూసుఫ్‌గూడ పోలీసులు

కుర్చీ తాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుర్చీ మడత పెడ్తానంటూ ఫేమస్‌ అయిన కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషాను యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద మధురానగర్‌ ఎస్సై ఇక్బాల్‌ అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ఇక్బాల్‌ కథనం ప్రకారం.. కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషా సోషల్‌ మీడియాలో పరుష పదజాలంతో దూషిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడంటూ యాదగిరి నగర్‌లో నివాసముండే వైజాగ్‌ సత్య అనే యూట్యూబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాలా పాషాను కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద అదుపులోకి తీసుకుని మధురానగర్‌ పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని కుర్చీ తాత తన తప్పును అంగీకరించడంతో కేసు రాజీ కుదిరినట్టు ఎస్సై తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z