NRI-NRT

అలరించిన బాటా సంక్రాంతి

అలరించిన బాటా సంక్రాంతి

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా వంటల పోటీలు, ముగ్గులు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, మెలోడీ పాటల పల్లకి వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత కచేరీ, క్లాసికల్ డ్యాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, వేదికపై గేమ్ షో, డ్యాన్స్‌లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా 30 రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆహూతులు ఆరగించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమై రాత్రి 10గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా అతిథులు వచ్చారు. ఆడిటోరియాన్ని సంక్రాంతి పండుగ శోభ ప్రతిబింబించేలా తెలుగు లోగిళ్లు ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్‌డ్రాప్‌లు, రంగురంగుల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు, కంటెస్టెంట్లు, బాటా వాలంటీర్ల సంప్రదాయ దుస్తులు, వారి అలంకరణలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ‘పాటల పల్లకి’తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో BATA కరోకే బృందంలోని ప్రతిభావంతులైన గాయకుల లైవ్ పెర్ఫామెన్స్‌, సంగీత కచేరీ, టాలీవుడ్ గాయని ఐశ్వర్య పాడిన సూపర్ హిట్ పాటలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z