WorldWonders

శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం. 9ఏళ్ల బాలుడి చొరబాటు.

శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం. 9ఏళ్ల బాలుడి చొరబాటు.

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతా వ్యవస్థ డొల్లతనం బట్టబయలైంది.తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి అర్ధరాత్రి ఆలయంలో దర్జాగా సంచరించాడు. తర్వాత పెద్ద నిచ్చెన సహాయంతో ప్రాకారం పైనుంచి దిగి తాపీగా కిందకు వచ్చాడు.వివరాల్లోకి వెళితే… శ్రీకాళహస్తి శివారు ప్రాంతం సాయిబాబా నగర్‌కు చెందిన గౌరి పట్టణంలోని ఐసీడీఎస్‌ కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తుంటారు. ఆమెకు పార్థసారధి రెడ్డి (14) అనే మానసికంగా పరిణతి చెందని కుమారుడున్నాడు. పట్టణంలోని ఓ పైవ్రేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి మరణించడంతో అమ్మ,బాబాయ్‌ పర్యవేక్షణలో విద్యార్ధి పెరుగుతున్నాడు.పరీక్షల్లో చూసి రాస్తున్నాడంటూ పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో గురువారం సాయంత్రం ఇంట్లో పార్థసారధి రెడ్డిని మందలించారు.ముక్కంటి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం పెయింటింగ్‌ పనులు చేస్తున్నారు. అందుకోసం ఆలయ ప్రాకారానికి ఇరువైపులా సారవ కొయ్యలు, నిచ్చెనను ఉంచారు. ఆలయంలోకి పార్థసారధి రెడ్డి ఎప్పుడు ప్రవేశించాడో… ఎలా వెళ్లాడో ఎవ్వరూ గుర్తించలేదు.అర్ధరాత్రి ఆలయంలో సంచరించాడు.శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. మొదట రూ.750రాహు కేతు సర్పదోష నివారణ పూజా మండపం పైకి ఎక్కాడు.అక్కడికి సమీపంలో ఉన్న నిచ్చెనను తీసుకున్నాడు. ఆలయ మూడో గోపురం పక్కనే ప్రాకారం నుంచి నిచ్చెన అనువుగా ఏర్పాటు చేసుకుని కిందకు దిగాడు. సన్నిధి వీధిలో వున్న ఓ లాడ్జిలో పని చేసే యువకుడు ఆలయం నుంచి పార్థసారధి రెడ్డి బయటకు రావడం గుర్తించి ప్రశ్నించాడు.ఇది గమనించిన స్థానికులు బ్లూ కోల్ట్‌ పోలీసులకు పార్థసారధి రెడ్డిని అప్పగించారు. వన్‌టౌన్‌ పోలీసులు పార్థసారధి రెడ్డి తల్లిని, బాబాయ్‌ని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పార్థసారధి రెడ్డిని అప్పగించారు.

ముక్కంటి ఆలయంలో భద్రతా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.నిజానికి ముక్కంటి ఆలయానికి భారీ భద్రతా వ్యవస్థ ఉంది.260మంది సెక్యూరిటీ గార్డులు,32మంది హోంగార్డులే కాక 17మందితో కూడిన ఎస్పీఎఫ్‌ బలగాలున్నాయి. వీరందరినీ పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా వున్నారు.అయినప్పటికీ ఒక బాలుడు అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా… ఎవరి కంటాపడకుండా వెలుపలికి రావడం గమనార్హం.పార్థసారధి రెడ్డి స్థానంలో అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడి ఉంటే పరిస్థితి ఏంటనేది ప్రశ్న.ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు మహాశివరాత్రి ఉత్సవాలు 20 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇంతటి కీలక సమయంలో ఇలాంటి ఘటన వెలుగు చూడడం భద్రతావ్యవస్థకు అవమానకరంగా మారింది.రెండు నెలల నుంచి కొందరు అధికారులు అత్యుత్సాహంతో ఎస్పీఎఫ్‌ బలగాలకు మహాద్వారం వద్ద రిజిస్టర్‌ నమోదు చేసే విధులను అప్పగించారు.దీంతో భద్రతా సిబ్బంది రిజిస్టర్లు చేతబట్టి వచ్చిపోయే ప్రముఖుల పేర్లు రాసుకోవడంపై దృష్టి పెట్టి అసలు విధులను గాలికొదిలేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z