అయోధ్య బాలరాముని దర్శనానికి భక్త జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేసుకున్న బాలక్‌రామ్‌ను చూసేందుకు రామ భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల నుంచి భారీగా హుండీ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. బాలక్ రాముడి దర్శనానికి వెళ్లే మార్గంలో మొత్తం 4 హుండీలు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ఆఫీస్ ఇంఛార్జ్ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. గత నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్‌రాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు బాలుని రూపంలో ఉన్న శ్రీరాముడిని చూసి తరించారు. అదేవిధంగా విరాళాల రూపంలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం రూ.8 కోట్లు ఉండగా, చెక్కులు, ఆన్‌లైన్ పేమెంట్ రూపంలో మరో రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z