Editorials

పార్లమెంటు బలహీనపడుతుంది. జడ్జీల వయస్సు పెంచలేము.

పార్లమెంటు బలహీనపడుతుంది. జడ్జీల వయస్సు పెంచలేము.

హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును వారి పనితీరు ఆధారంగా పెంచడం ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. ఒకవేళ అలాచేస్తే పార్లమెంటు అధికారాలు మరింతగా క్షీణించిపోతాయని, అనుచిత లబ్ధికి కూడా దారితీస్తుందని పేర్కొంది. ‘న్యాయ, సిబ్బంది శాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం’ గత ఆగస్టులో చేసిన సిఫార్సుపై ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. న్యాయ ప్రక్రియలు, సంస్కరణల గురించి ఇచ్చిన నివేదికలో ఈ సిఫార్సు ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా, హైకోర్టు న్యాయమూర్తులకు 62 ఏళ్లుగా ఉంది. న్యాయమూర్తుల ఆరోగ్య పరిస్థితులు, తీర్పుల్లో నాణ్యత, ఇచ్చిన తీర్పుల సంఖ్య వంటివి పరిగణనలో తీసుకుని రిటైర్మెంట్‌ వయసు పెంచాలని భాజపా ఎంపీ సుశీల్‌కుమార్‌ మోదీ నేతృత్వంలోని స్థాయీసంఘం సిఫార్సు చేసింది. పనితీరుకు, పదవీ విరమణకు లంకె పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు రావని ప్రభుత్వం పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z