* నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్ పరిధి శివాజీనగర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్ స్వీటీ (20).. టైలరింగ్ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* నాదర్‌గుల్ డీపీఎస్(ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో పీఈటీ వికృత చేష్టలు బయటపడ్డాయి. 13 ఏండ్ల వయసున్న ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పీఈటీపై ఆరోపణలు వచ్చాయి. ఆ విద్యార్థిని పట్ల ప్రతి రోజు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు తమకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు పీఈటీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* భార్యాభర్తల మధ్య గొడవ (couple’s fight) ఆపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో మహిళ భర్తను హత్య చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొల్లాచ్చికి చెందిన 59 ఏళ్ల రాధాకృష్ణన్, 48 ఏళ్ల భార్య సరస్వతి మంగళవారం రాత్రి గొడవపడ్డారు. భూమి అమ్మకానికి సంబంధించి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రాధాకృష్ణన్‌కు చెందిన భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారాన్ని నడుపుతున్న 36 ఏళ్ల శివకుమార్ జోక్యం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే రాధాకృష్ణన్ కొడవలితో శివకుమార్‌పై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన అతడు రాధాకృష్ణన్ చేతిలోని కొడవలిని లాక్కున్నాడు. దానితో అతడ్ని నరికి హత్య చేశాడు.
* ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అంబటి మహేశ్ కూతురు లాక్షణ్య (13) సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మాత్ర వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు తగ్గింది. అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది. కాసేపటికి బూత్‌రూంకు వెళ్లింది ఎంతకీ బయటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని, తీవ్రమైన గుండెపోటు రావడంతోనేనని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z