Editorials

పీవీకి భారతరత్న-తాజావార్తలు

పీవీకి భారతరత్న-తాజావార్తలు

* భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. మహమ్మద్‌ షమీ, హసిన్‌ జహాన్‌కు 2014లో వివాహం కాగా 2015లో ఐరా జన్మించింది. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు.

* తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు.

* పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌లు నాడు, నేడు, ఎప్పటికీ భారతదేశపు రత్నాలేనని కాంగ్రెస్‌ (Congress) పార్టీ పేర్కొంది. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని.. ప్రతీ భారతీయుడు వారిని గౌరవిస్తాడని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) తెలిపారు.

* హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్‌ పేరును ప్రస్తావించారు. ఆ ఐఏఎస్‌ అధికారి…బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారు.

* ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలు, బోర్డులపై అందరూ టీజీ అని రాసుకున్నారు. కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారు.

* ఐఫోన్‌ ‘హ్యాక్‌ అలర్ట్‌’ వ్యవహారం ఆ మధ్య తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఫోన్లకు ‘హ్యాక్‌ అలర్ట్‌ (Hack Alerts)’ మెసేజ్‌లు వచ్చాయి. ఈ అంశం తాజాగా రాజ్యసభలోను చర్చకు వచ్చింది. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఈ విషయాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘గతేడాది అక్టోబరు 30న నాతో పాటు పలువురు విపక్ష ఎంపీలకు యాపిల్‌ నుంచి అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని దాని సారాంశం. దీనిపై అదేరోజు నేను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw)కు లేఖ రాశాను. కానీ నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు’’ అని ఆమె దుయ్యబట్టారు.

* సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో భాజపా-రాష్ట్రీయ లోక్‌దళ్‌(BJP-RLD) పొత్తు దాదాపుగా ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌధరీ(Jayant Chaudhary) మాటలు ఈ విషయాన్ని ధ్రువీకరించేలా ఉన్నాయి. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్‌(Chaudhary Charan Singh)కు తాజాగా కేంద్రం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పొత్తు గురించి జయంత్‌ను ప్రశ్నించగా.. ‘ఇప్పుడు నేను ఆఫర్‌ను ఎలా తిరస్కరించగలను..?’ అంటూ బదులిచ్చారు.

* దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడంపై ఆయన కుమార్తె, భారాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా పీవీ సేవలను గుర్తించారని.. ప్రధాని నరేంద్రమోదీ సంస్కారానికి ఇది నిదర్శనమని కొనియాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడారు.

* కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఓ కీలక నివేదిక ఊరటనిచ్చే విషయాన్ని తెలియజేసింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల స్థానంలో ఏఐని నియమించుకోవటం సాధ్యం కాకపోవచ్చునని వెల్లడించింది. చాలా కంపెనీలకు అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ’ అధ్యయనం వెల్లడించింది.

* ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకు వెల్లడించింది. ‘‘మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉంది. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో-పసిఫిక్‌లో ఆ దేశం కీలక భాగస్వామి’’ అని పేర్కొంది.

* తెలంగాణ ఆర్థిక పరిస్థితి సీఎం రేవంత్‌ రెడ్డిలా చురుగ్గా లేదని భాజపా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్‌ తమిళిసై ప్రసంగం ఉందన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z