Politics

పంజరం నుంచి స్వేచ్ఛ పొందినట్లు ఉంది-Mandali

పంజరం నుంచి స్వేచ్ఛ పొందినట్లు ఉంది-Mandali

పంజరం నుంచి స్వేచ్ఛ పొందినట్లు ఉంది – మాజీ ఉపసభాపతి మండలి

నా పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షి లాగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉంది.దయచేసి కార్యకర్తలు,నాయకులు గమనించి వ్యవహరించండి.నా ఆలోచనలు,నేను నమ్మిన సిద్దాంతాలు మీకు తెలుసు.పదవులకోసం పుట్టలేదు.పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి,మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు,దాచుకోలేదు.రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి.డబ్బు రాజకీయాలకు ప్రధానమై పోయింది.ఓటరుని కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతులకోసం అన్వేషిస్తున్న తరుణంలో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదు.పరిస్దితులను కార్యకర్తలు,ప్రజలు అర్దం చేసుకోండి.దయచేసి వేరేవిదంగాఆలోచించవద్దు. -మండలి బుద్ద ప్రసాద్

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z