NRI-NRT

30వేల మంది గ్రూప్-2 అభ్యర్థులకు నాట్స్ చేయూత

30వేల మంది గ్రూప్-2 అభ్యర్థులకు నాట్స్ చేయూత

ఏపీ ప్రభుత్వం నుండి గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఈ పరీక్షల్లో పోటీపడుతున్న 30వేల మంది అభ్యర్థులకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఉచిత స్టదీ మెటీరియల్‌ను అందజేసింది. ఈ కార్యక్రమానికి నాట్స్ అధ్యక్షుడు నూతి బాపు ఆర్థిక సహకారాన్ని అందజేశారు. శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు సమన్వయంలో గ్రూప్-2 పరీక్ష అవగాహనా సదస్సులను ఏపీలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అభ్యర్థులకు వీటిని పంపిణీ చేశారు. గ్రూప్-2కి పోటీపడే అభ్యర్థుల్లో చాలా మంది పేదవారు ఉన్నారని వారికి ఉచిత మెటిరియల్ ఇచ్చి సాయ్పడినందుకు లక్ష్మణరావు, అభ్యర్థులు నాట్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z