Movies

దర్శకుడు క్రిష్‌కు డ్రగ్స్ తలనొప్పులు-CrimeNews-Feb 27 2024

దర్శకుడు క్రిష్‌కు డ్రగ్స్ తలనొప్పులు-CrimeNews-Feb 27 2024

* విదేశాల నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మహిళను ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ నమ్మించి మోసగించాడు (Bank Fraud). నకిలీ మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబరుతో ఆమె ఖాతాలోని రూ.13.5 కోట్లు స్వాహా చేశాడు. దీంతో ఆ మహిళ లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే..భారత సంతతికి చెందిన శ్వేతశర్మ 2016లో తన భర్తతో కలిసి అమెరికా నుంచి దేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. గురుగ్రామ్‌లో ఉంటున్న ఆమెకు స్నేహితుల ద్వారా ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్‌లో పనిచేసే మేనేజర్‌ పరిచయమయ్యాడు. విదేశాలతో పోలిస్తే ఇక్కడ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ వస్తుందని ఆ మేనేజర్‌ వారికి చెప్పాడు. దీంతో 2019 సెప్టెంబరు నుంచి 2023 డిసెంబరు మధ్య శ్వేత దాదాపు రూ.13.5 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. రాబోయే ఏళ్లలో వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ.16 కోట్లకు పెరుగుతుందని ఆ మేనేజర్‌ వారికి చెప్పాడు. అయితే, ఈ ఏడాది జనవరిలో ఆమె బ్యాంకుకు వెళ్లి తన ఖాతాను చూసుకోగా డబ్బంతా మాయమైంది. దీంతో ఆమె దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. ‘‘ఇన్నాళ్లూ నాకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆ మేనేజర్ తరచూ నాకు డిపాజిట్‌ రసీదులు పంపించాడు. ఈమెయిల్‌ స్టేట్‌మెంట్లు కూడా వచ్చాయి. కానీ జనవరిలో బ్యాంకుకు వెళ్లి చూడగా ఒక్క రూపాయి కూడా లేదు. అతడు నాకు నకిలీ స్టేట్‌మెంట్లు పంపించాడని అర్థమైంది. నా పేరు మీద నకిలీ ఈమెయిల్‌ ఐడీ సృష్టించాడు. వేరే మొబైల్‌ నంబరు తీసుకుని బ్యాంకు రికార్డుల్లో మార్చేశాడు. అందుకే విత్‌డ్రా చేసినప్పుడు నాకు మెసేజ్‌లు రాలేదు’’ అని ఆమె వాపోయారు. కాగా.. ఈ మోసంపై ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పందించింది. ఆ మేనేజర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ‘‘కస్టమర్ల సేవలే మా ప్రథమ ప్రాధాన్యం. ఆమె ఖాతా నుంచి జరిగిన లావాదేవీల గురించి రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీకి ఎప్పటికప్పుడు సందేశాలు వెళ్లాయి. కానీ, బ్యాంకు రికార్డుల్లో ఫోన్‌ నంబరు, ఈమెయిల్ ఐడీని తనకు తెలియకుండా మార్చినట్లు కస్టమర్‌ చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని బ్యాంక్‌ తెలిపింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత డిపాజిట్లు మొత్తం ఆమెకు అందేలా చూస్తామని పేర్కొంది.

* రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారు. వారిలో వివేకానంద, కేదార్‌, నిర్భయ్‌ కొకైన్‌ సేవించినట్లు పరీక్షల్లో తేలింది. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. వివేకానందకు అబ్బాస్‌ 10 సార్లు కొకైన్‌ను డెలివరీ చేశాడు. ఈ కేసులో నిందితులైన లిషి, శ్వేత, సందీప్‌ పరారీలో ఉన్నారు. చరణ్‌ బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. సినీ దర్శకుడు క్రిష్‌ ఆ పార్టీలో పాల్గొన్నట్లు పూర్తిగా నిర్ధరణ కాలేదు. ఆయన విచారణకు హాజరవుతానని చెప్పారు’’ అని వివరించారు. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు యువతులు సహా 9 మందిని అరెస్ట్‌ చేశారు.

* లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దుండిగల్‌లోని ఓ కళాశాలలో మనోజ్‌ బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ లోన్‌ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తానికి సక్రమంగా ఈఎంఐ చెల్లించలేదు. దాంతో యాప్‌ ఏజెంట్లు విద్యార్థి బంధువులకు ఫోన్‌ చేసి డబ్బులు అడిగారు. విషయం అందరికీ తెలిసిందని మనస్తాపం చెందిన మనోజ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

* న‌గ‌ర ప‌రిధిలోని మాదాపూర్ – కేపీహెచ్‌బీ కాల‌నీల మ‌ధ్య ఘోరం జ‌రిగింది. ఈ మార్గంలో వేగంగా వెళ్తున్న కారులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ కారును ఆపాడు. అందులో ఉన్న ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఇంజిన్‌లో నుంచి మంట‌లు చెల‌రేగిన‌ట్లు డ్రైవ‌ర్ తెలిపాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో కారు పూర్తిగా దగ్ధ‌మైంది. కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో మాదాపూర్ – కేపీహెచ్‌బీ మ‌ధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్ పోలీసులు కారును రోడ్డు ప‌క్క‌కు నెట్టేసి, ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.

* ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) జరిగింది. బీజాపూర్‌ (Bijapur) జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxalites) మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

* ఘజియాబాద్‌ (Ghaziabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కొత్త దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఘజియాబాద్‌ వైశాలి ప్రాంతానికి చెందిన అభిషేక్‌ (25), అంజలికి గతేడాది నవంబర్‌ 30న వివాహమైంది. ఈ కొత్త జంట సోమవారం నాడు సరదాగా బయటకు వెళ్లాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు (Delhi Zoo) వెళ్లారు. అక్కడ కాసేపు ఇద్దరూ సరదాగా గడిపారు. అనంతరం కాసేపటికి అభిషేక్‌కి ఛాతిలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డాడు. కాసేపటికి నొప్పి ఎక్కువైంది. దీంతో అంజలి తన స్నేహితులకు ఫోన్‌ చేసి వారి సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ అభిషేక్‌ను పరీక్షించిన వైద్యులు సఫ్దర్‌జంగ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z