Agriculture

మన ఒంగోలు ఆవు…₹40కోట్లకు అమ్మకం!

మన ఒంగోలు ఆవు…₹40కోట్లకు అమ్మకం!

మన దగ్గర దొరికే నెల్లూరు, ఒంగోలు మేలు రకానికి చెందిన ఆవులు బాగా ప్రసిద్ధి. ఈ జాతులకు చెందిన ఆవులకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు (Nelore cow) బ్రెజిల్‌ (Brazil)లో రికార్డు ధర పలికింది. వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట. భార‌త‌దేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా (World Most Expensive Cow) రికార్డుకెక్కింది. దీంతో ఈ అంశం కాస్తా ప్రస్తుతం చర్చీనాయాంశమవుతోంది. ఈ రకపు ఆవును 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ రంక ఆవులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు ఈ రకం ఆవులు ఒక్క బ్రెజిల్‌ దేశంలోనే 16 మిలియన్ల వరకూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z