Agriculture

వేసవి ప్రభావం…350శాతం పెరిగిన నిమ్మ ధరలు

వేసవి ప్రభావం…350శాతం పెరిగిన నిమ్మ ధరలు

వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో తాపాన్ని తగ్గించుకునేందుకు జనం వివిధ రకాల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో రూ.20కి లభ్యమైన అరడజను పెద్దసైజు నిమ్మకాయలు.. ఇప్పుడు రూ.40 వరకు పలుకుతున్నాయి. విడిగా అయితే ఒక్కో నిమ్మకాయను రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణం. నిమ్మసాగు అధికంగా జరిగే కర్ణాటకలో ఈ ఏడాది ఉత్పత్తి దాదాపు 40 శాతం తగ్గింది. దీంతో ఆ రాష్ట్రంలో హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల క్రితం హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.2 వేలు పలికిన 1,000 పెద్దసైజు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా రూ.7 వేలకుపైగా చెల్లించాల్సి వస్తున్నది. అంటే ఈ నెల రోజుల్లోనే నిమ్మకాయల ధరలు 350 శాతం పెరిగినట్టు స్పష్టమవుతున్నది. దేశంలో నిమ్మసాగు ఎక్కువగా ఏపీ, కర్ణాటక, తెలంగాణలో జరుగుతుంది. ఏటా ఏపీలో దాదాపు 7, కర్ణాటకలో 3, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చేది. రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానికంగా అమ్మడంతోపాటు సూరత్‌, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మీదుగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మ దిగుబడి భారీగా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z