NRI-NRT

సిరికోన సాహితీ అకాడమీ నవలా రచన పోటీ విజేతలు వీరే

సిరికోన సాహితీ అకాడమీ నవలా రచన పోటీ విజేతలు వీరే

డా.అక్కినేని శతజయంతి సందర్భంగా– ‘సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు,సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ’ పురస్కార విజేతలను జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని,2023వ సంవత్సరం ‘సిరికోన- జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కార’ నవలారచన పోటీలు నిర్వహించారు. ఏదైనా ఓ కళారంగానికి సంబంధించిన ఇతివృత్తంతో రచింపబడ్డ నవలలను పోటీకి ఆహ్వానించారు. కళానుభవం, ఇతివృత్త సంవిధానం, పాత్ర చిత్రణ, నవలాశిల్పం, భాష అనే అంశాల ఆధారంగా వచ్చిన నవలలను న్యాయనిర్ణేతలు పరిశీలించారు. ఈ దిగువ విజేతలు ఇరువురుకి పురస్కార మొత్తాన్ని సమానంగా పంచాలని నిర్వాహకులు నిర్ణయించారు.

1. డా. పాణ్యం దత్తశర్మ(హైదరాబాద్) – “శ్రీమద్రమారమణ”
2. కోసూరి ఉమాభారతి(హ్యూస్టన్) – “హృదయగానం: నేడే విడుదల”

“కచ్ఛపి నాదం” రచయిత్రి మంథా భానుమతికి ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. త్వరలో అంతర్జాలంలో వీరికి పురస్కార ప్రదానోత్సవం చేస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z