DailyDose

అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం-CrimeNews-Apr 13 2024

అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం-CrimeNews-Apr 13 2024

* పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్న పోలీసులు. తాజాగా సాహిల్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు. 2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం. ఈ ప్రమాదంలో నెలల చిన్నారి మృతి, ఇద్దరికీ గాయాలు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.

* సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం అమెరికా (USA)లో ఓ హత్య ఘటన చోటుచేసుకుంది. భారత్‌ (India)కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతంగా కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడైన భద్రేశ్‌ కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌ను అగ్రరాజ్య ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. తాజాగా అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లకు పైమాటే) ఇస్తామని వెల్లడించింది. 2015 ఏప్రిల్‌ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రేశ్ పటేల్‌, అతడి భార్య పాలక్‌ స్థానికంగా ఉండే ఓ డోనట్‌ దుకాణంలో పని చేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్‌ దగ్గరకు అతడు వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

* మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ (Jaffer Sadiq) రూ.కోట్లను చిత్ర పరిశ్రమ, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆరోపించింది. ఏప్రిల్‌ 9న చెన్నై, మదురై, తిరుచురాపల్లిలో ఫెడరల్‌ ఏజెన్సీ జరిపిన దాడుల ఆధారంగా ఈడీ శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది.

* పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్‌, కబీర్‌ కేరళలో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు.

* ఓ ఐదేళ్ల చిన్నారిపై పలువురు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన ఘటన గోవాలోని వాస్కో ప్రాంతంలో చోటుచేసుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) సునీతా సావంత్ తెలిపిన వివరాల ప్రకారం…గోవాలోని వాస్కోలో గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన ఐదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం వడెమ్ ప్రాంతంలోని ఓ నిర్మాణస్థలంలో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు, చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది. రిపోర్టు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. 20 మంది అనుమానితులను, సమీపంలోని కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z