Politics

చంద్రబాబు అంటేనే నిజం: భువనేశ్వరి-NewsRoundup-Apr 13 2024

చంద్రబాబు అంటేనే నిజం: భువనేశ్వరి-NewsRoundup-Apr 13 2024

* ఐపీఎల్‌, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్‌ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు తెలుగమ్మాయి వింధ్యా విశాఖ. కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాలేజీ రోజుల్లోనే న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె.. కొంతకాలం మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని చెప్పారు. ‘‘కాలేజీ రోజుల్లో పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచా. దాంతో మోడలింగ్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. పలు ఉద్యోగాల అనంతరం మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నా. అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ షో. అక్కడి వాతావరణం నాకు నచ్చలేదు. దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులుండేవి కావు. బ్యాక్‌ స్టేజ్‌లో అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి షాకయ్యా. ఆ రంగం నాకు సెట్‌ కాదనిపించింది. మోడలింగ్‌ వదిలేశా. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందని చెప్పను. నాకు ఎదురైన అనుభవం మాత్రం ఇదే’’ అని వింధ్య తెలిపారు. ‘గోపాల గోపాల’, ‘ముకుందా’ చిత్రాల్లో తనకు అవకాశం వచ్చిందని.. ఆసక్తి లేని కారణంతో నో చెప్పానని అన్నారు.

* ‘నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌’ అని నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపు సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో పాల్గొని ఆమె ప్రసంగించారు.

* ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వం ఆదుకుంటందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలి. కానీ, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపించడం లేదు. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కరెంటు కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు. అందని సాగు, తాగునీరు. చాలా ఇబ్బందుల్లో రైతాంగం చెట్టుకొకరు పుట్టకొకరు ఉండే పరిస్థితి. దాన్ని నివారించాలని.. కోడి రెక్కల కింద పిల్లల్ని కాపాడుకున్నట్టు రైతుల్ని మనం కాపాడుకున్నాం.

* హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండి (Mandi) నుంచి భాజపా (BJP) లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగిన సినీనటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి దీటుగా బదులిస్తున్నారు. ఆ స్థానం నుంచి ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కుమారుడి అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. మండి ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉన్నారని వెల్లడించారు. తన కుమారుడికి వ్యతిరేకంగా కంగన చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. ఎంతో క్లిష్ట సమయంలో కూడా తాను ఇక్కడినుంచి గెలిచినట్లు చెప్పారు. ఆమె మాజీ సీఎం వీరభద్రసింగ్‌ సతీమణి. మండి సిట్టింగ్ ఎంపీ.

* ఎన్నికల అధికారులపై విజయవాడకు చెందిన వైకాపా నేత దురుసుగా ప్రవర్తించారు. తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో విజయవాడ 58వ డివిజన్‌ కృష్ణ హోటల్‌ సెంటర్లో ఉన్న వైకాపా జెండాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా.. అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త శ్రీనివాస్‌రెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. మా పార్టీ జెండాలు తీయడానికి మీరెవరంటూ వాగ్వాదానికి దిగారు. మున్సిపల్‌ సిబ్బంది స్వాధీనం చేసుకుని వ్యాన్‌లో వేసిన జెండాలను తీసి బలవంతంగా వైకాపా కార్యాలయానికి తరలించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల జెండాలు కట్టాలంటే అనుమతి తీసుకోవాలని అధికారులు చెప్పినా ఖాతరు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

* సరోగసీ (surrogacy) ద్వారా మాతృత్వాన్ని పొందడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్ మార్కెట్ ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఘాటుగా స్పందించారు. ‘‘ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛాచర్య అని మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తాను’’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. దీనిని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హం. అతివాద భావజాలం కలిగిన అధికార పక్షం ఈ నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లల్ని కనకుండా ఈ బిల్లు నిషేధించనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

* 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ‘‘రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి.. ఆ జిల్లాల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు.. జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్‌ పోవాలి.. ప్రజలు గెలవాలి.

* ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) దాడి చేయొచ్చన్న సంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న నిఘా వర్గాల సమాచారం ధ్రువీకరించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Jeo Biden) స్పందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేస్తారని ఆయన అంచనా వేశారు. ‘‘నేను రహస్య సమాచారం జోలికి వెళ్లాలనుకోవడం లేదు. దాడికి మాత్రం ఎంతో సమయం లేదని నా అంచనా. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇరాన్ విజయం సాధించదు’’ అని స్పష్టం చేశారు. ‘‘చేయకండి’’ అంటూ ఒక్క పదంలో ఇరాన్‌కు సందేశం పంపారు.

* 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ‘‘రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి.. ఆ జిల్లాల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు.. జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్‌ పోవాలి…..ప్రజలు గెలవాలి.

* సార్వత్రిక ఎన్నికలు (Lok sabha elections) దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టో (Manifesto)ను ప్రకటించగా.. ఇప్పుడు భాజపా (BJP) తమ ‘సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

* కడప వైకాపా (YSRCP) ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్‌రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. ఆయన్ను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

* నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఎంవీపీ కాలనీలోని బస్‌ కాంప్లెక్స్‌ ఎదుట 7 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు శనివారం దర్శనమిచ్చాయి. ‘‘విశాఖలోని సిరిపురంలో క్రిస్టియన్‌ భూములు కొట్టేసిందెవరు? స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్‌నకు కారణమైందెవరు? ఐపీఎస్‌ అధికారుల స్థలాలనూ కబ్జా చేసిందెవరు? వృద్ధుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆశ్రమ స్థలాలను కాజేసిందెరు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు.

* కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్‌/ బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలంది. ‘‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్‌ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ (NCPCR) జరిపిన విచారణలో.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం, 2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదు అని నిర్ధరణకు వచ్చింది’’ అని కేంద్రం ఏప్రిల్‌ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

* కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్‌ తగిలింది. నియోజకర్గంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత షేక్‌ మౌలాలి తెదేపాలో చేరారు. ఆయనతో పాటు అనుచరులకు గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకు మౌలాలి లాంటి వ్యక్తులు తెదేపాలోకి వస్తున్నారన్నారు.

* ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రధాని తాజాగా పంచుకున్నారు. ఇందులో ప్రతిపక్షాలను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ పరిభాషలోని ‘నూబ్‌ (Noob)’తో విపక్షాలను పోలుస్తూ ప్రధాని సెటైర్లు వేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి (Noshki) జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు.. క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్నారు. అందులోని 9 మంది ప్రయాణికులను కిడ్నాప్‌ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలు దొరికాయి.

* ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించిన సంగతి తెలిసిందే. వారితో ప్రధాని సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియో ఈ రోజు విడుదలైంది. వారంతా గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. అలాగే మన పురాణాల ఆధారంగా గేమ్స్ రూపకల్పన గురించి, ఈ రంగంలో కెరీర్‌ ఎంచుకుంటున్నవారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించుకున్నారు.

* దేవదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగిస్తే .. భక్తులు ఇబ్బందులకు గురవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. దేవాదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దంటూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆమె లేఖ రాశారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎండోమెంట్‌ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కొందరు ఉన్నతాధికారులు సీఈవోకు సూచించినట్టు తెలిసింది. గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేవాదాయశాఖ సిబ్బందిని వినియోగించుకోలేదు. ఆ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలన విధులు నిర్వహిస్తారు. అందువల్ల వారి సేవలు అనివార్యం. సిబ్బంది అంతా హిందూ మతానికి చెందినవారే ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z