DailyDose

మాదాపూర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు-CrimeNews-Apr 17 2024

మాదాపూర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు-CrimeNews-Apr 17 2024

* గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Accident). వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్‌ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (car rams trailer truck). ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నదియాడ్‌ (Nadiad)లోని అహ్మదాబాద్‌ – వడోదర ఎక్స్‌ప్రెస్‌వే (Ahmedabad – Vadodara Expressway)పై బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌వైపు వెళ్తోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైలర్‌ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డెడ్‌బాడీస్‌ను రెండు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

* సహజీవనం చేస్తున్న మహిళకు మరొకరితో సంబంధం ఉందని ఒక వ్యక్తి అనుమానించాడు. వేరుగా నివసిస్తున్న ఆమెపై పగపెంచుకున్నాడు. ఆ మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. పగులగొట్టిన బీర్‌ బాటిల్‌తో బాలుడి గొంతుకోసి చంపాడు. (Man Kills Son Of Live In Partner) మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెతుల్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల గణేష్ మీనా ఒక మహిళతో కలిసి సహజీవనం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. దీంతో ఆ మహిళ సర్నీ పట్టణంలో వేరుగా నివసిస్తున్నది. అయితే ఆరేళ్ల కుమారుడ్ని గణేష్‌ వద్ద ఉంచింది.

* గ‌త కొద్దినెల‌లుగా దేశ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ స్కామ్‌లు విప‌రీతంగా పెరిగాయి. రోజుకో త‌ర‌హా స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు ఆన్‌లైన్ అడ్డాగా అమాయ‌కుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా న‌వీ ముంబైకి చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్ స్కామ్‌లో ఏకంగా రూ. 45.69 ల‌క్ష‌లు పోగొట్టుకున్నారు. షేర్ల‌లో పెట్టుబ‌డులు పెడితే అధిక‌ రిట‌న్స్ వ‌స్తాయ‌ని మ‌భ్య‌పెట్టిన స్కామ‌ర్లు బాధితుడిని నిండా ముంచారు. సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి భారీ లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మించి మార్చి 2 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కూ రూ. 45.69 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టించి ఆపై ఉడాయించాడ‌ని బాధితుడు వాపోయాడు. త‌న పెట్టుబ‌డుల‌పై ఎలాంటి రిట‌న్స్ రాక‌పోగా అస‌లు మొత్తం కూడా స్కామ‌ర్లు కాజేశార‌ని వెల్ల‌డించాడు. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

* హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై వెళ్తున్న బైక్‌ను ఓ భారీ లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవ‌ర్‌పై బైక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. నెమ్మ‌దిగా న‌డ‌పాల‌ని లారీ డ్రైవ‌ర్‌కు సూచించాడు. డ్రైవ‌ర్‌తో వాగ్వాదానికి దిగిన బైక‌ర్ లారీ బ్యానెట్‌పైకి ఎక్కాడు. మ‌రింత ఆగ్ర‌హానికి గురైన డ్రైవ‌ర్ లారీని మ‌రింత స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. ఈ క్ర‌మంలో మ‌రోసారి బైక్‌ను ఢీకొట్టాడు డ్రైవ‌ర్. బాధిత యువ‌కుడు లారీ డోర్‌లో వేలాడుతూ ఉండ‌గా.. వేగంగా రెండు కిలోమీట‌ర్లు ఆప‌కుండా ముందుకు పోనిచ్చాడు. చివ‌ర‌కు ఓ వెహిక‌ల్ అడ్డం రావ‌డంతో లారీని డ్రైవ‌ర్ ఆపాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మూడు హత్యలు చేసి నిందితుడు మృతదేహాల పక్కనే పడుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో గురుచరణ్‌ పాడియా అనే వ్యక్తి భార్య.. ఐదేళ్లు, ఏడాది వయస్సున్న ఇద్దరు బిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తప్పతాగి వచ్చి భార్య జానోతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.

* మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని కీలక నిందితుడు సోల్‌మెన్‌ నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చి.. రాజమహేంద్రవరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులని పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులకోసం బెంగళూరుకి వెళ్లి డ్రగ్స్‌ దందాలో దిగారని పేర్కొన్నారు. దర్యాప్తు నిమిత్తం డ్రగ్స్‌తో సహా నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z