Devotional

Telugu horoscope – Apr 20 2024

Telugu horoscope – Apr 20 2024

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం కాస్తంత బాగున్నందువల్ల రోజంగా సానుకూలంగానే గడిచిపోతుంది. గౌరవ మర్యాదలకు భంగం ఉండదు. రాజపూజ్యాలు ఎక్కువగానూ అవమానాలు తక్కువగానూ ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు వీలైనంతగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఓర్పు, సహనాలతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరు, ప్రతిభా పాటవాలు అధికారులకు నచ్చుతాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందు తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాక, విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. అదనపు ఆదాయం కోసం మరింతగా శ్రమ పడతారు. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. కొందరు స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన ఆలయాలకు వెడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సమాజంలో రాజపూజ్యతలకు లోటుండదు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంబంధించి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటికి బాగా దగ్గర బంధువుల రాకపోక లుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలు తలెత్తుతాయి. ఆధికారుల నుంచి వేధింపులు, ఒత్తిడి ఉండే అవకాశముంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులకు సహాయం చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పట్టుదలగా కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. మొండి బాకీలు వసూలవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులు బాగా ఎక్కువగా సహాయాన్ని ఆశిస్తారు. తోబు ట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఇష్టమైన బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి సంబంధించి అనుకోకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగు తాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంట ర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో వీలైనన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా, అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారు లకు బాగా ఉపయోగపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి కానీ, అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. గృహ, వాహన యోగాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది..

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశ ముంది. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగులోకి వస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z